-శివనాథ్ సమక్షంలో లోకేష్ ని కలిసిన బొమ్మసాని
-బీఫామ్ ఇచ్చిన వారికే నా మద్దతు
-జిల్లాలో మారుమోగుతున్న కేశినేని శివనాథ్ పేరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్ధులను గెలిపించి చంద్రబాబు కి గిప్ట్ గా ఇచ్చేందుకు విజయవాడ ఎంపి అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. టిడిపి గెలిచే ఏ అవకాశాన్ని జారవిడుచుకోవటం లేదు. ఎవర్నీ వదిలిపెట్టకుండా నాయకులందర్నీ కలుపువెళుతున్నాడు. ముఖ్య నాయకుల్ని టిడిపి అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్లి మాట్లాడిస్తున్నాడు.
మైలవరం నుంచి టిడిపి తరుఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేయాలని బొమ్మసాని సుబ్బారావు ఆశపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ టిక్కెట్ వైసిపి నుంచి టిడిపికి వచ్చిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి టిడిపి అధిష్టానం కేటాయించింది. దీంతో బొమ్మసాని సుబ్బారావు ని లోకేష్ తో మాట్లాడించే ఏర్పాటు కేశినేని శివనాథ్ చేశారు.
సోమవారం కేశినేని శివనాథ్(చిన్ని), ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం సమక్షంలో ఉండవల్లి నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని బొమ్మసాని సుబ్బారావు కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా సుబ్బారావు లోకేష్ కి పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పటం తో పాటు…చంద్రబాబు బీఫామ్ ఎవరికి ఇస్తే వారికి పూర్తి మద్దతు అందిస్తానని తెలియజేశారు. ఆదివారం తిరువూరులో జరిగిన మాదిగల ధూం!ధాం! బహిరంగ సభకి శావల దేవదత్తు హాజరై…టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు కి మద్దతు ప్రకటించటం వెనక కేశినేని శివనాథ్ గారు వున్నారు…దీంతో ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని శివనాథ్ పార్టీ గెలుపు కోసం చక్రం తిప్పతుండటంతో..టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో ఉత్సాహం పెరిగింది.
Prajavartha Online Telugu News