-రూరల్ ఆర్వో తేజ్ భరత్
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హోమ్ వోటింగ్ పై రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల అధికారులు, బి ఎల్ వో లు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారులకు , డిప్యూటీ తహశీల్దార్లకు మరియు సెక్టార్ అధికారులకు, జెసి ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్వో తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోం ఓటింగు కోసం ఎన్నికల కమీషన్ మార్గదర్శకా లను విడుదల చెయ్యడం జరిగింది అని పేర్కొన్నారు. ఆమేరకు సదరన్ ధ్రువపత్రాలు ఉన్న 18 ఏళ్లు నిండిన ఓటర్లు, 85 సంవత్సరాలు నిండిన ఓటర్ల ను గుర్తించి, వారికి హోం ఓటింగు పై అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కును వినియోగించు కోవడం కోసం పోలింగ్ కేంద్రానికి రాలేని వారికీ ఫారం 12 డి అందజేసేందుకు నిర్దేశించిన నియమాలను వివరించడం, స్వయంగా పోలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వేసే ఆసక్తి ఉన్న వారి నుంచీ ఆమేరకు నిర్థారణ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం లో సహాయ రిటర్నింగ్ అధికార్లు మరియు తహశీల్దార్లు వై. కె. వి. అప్పారావు , బి. రమాదేవి, ప్రధానోపాధ్యాయులు , ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News