పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాll శరత్ చౌహన్ ఆర్ట్స్ కళాశాల సందర్శన

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
చారిత్రాత్మక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల (ఆర్ట్స్ కళాశాల) రాజమండ్రి ని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాll శరత్ చౌహన్ గురువారం సందర్శించడం జరిగింది. రాజమండ్రి పట్టణ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేశారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పని చేసిన తత్వశాస్త్ర విభాగమును, కందుకూరి వీరేశలింగం పనిచేసిన తెలుగు విభాగమును, ఎంతో ప్రాచీనమైన గ్రంథాలకు నిలయమైన కళాశాల గ్రంధాలయమును, పురాతనమైన పరికరాలు గల భౌతికశాస్త్ర యాంటిక్ ల్యాబ్ ను, అంబేద్కర్ విగ్రహంను , తరగతి గదులను శరత్ చౌహాన్ సందర్శించడం జరిగింది. ఎంతో చారిత్రాత్మకమైన మరియు మహనీయులు నడిచిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం తనకు ఎంతో గర్వకారణంగా వుందని, ఒకవైపు సాంకేతికా భివృద్ధితో ముందడుగు వేస్తూనే, చారిత్రక వారసత్వ సంపదను సంరక్షిస్తున్న విధానం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు . తమ తాతగారు డాII భాగవతుల అప్పారావు ఇదే కళాశాలలో 74 సంవత్సరాల క్రితం తత్వ శాస్త్ర అధ్యాపకులుగా సేవలు అందించారని, అలాంటి కళాశాలను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ప్రారంభించి నిర్వహిస్తున్న అర్బన్ కాఫీ సెంటర్ మరియు జూట్ బ్యాగ్ స్టార్ట్ అప్ ను శరత్ చౌహన్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థులు ఈ కళాశాల పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరారు.

కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీశైల శాస్త్రి , ఐ.క్యూ.ఏ. సి. సమన్వయకర్త డాll ఏ.అన్నపూర్ణ , అకడమిక్ సెల్ సమన్వయకర్త డాllసంజీవ్ గారు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ జి. చంద్రశేఖర్ , టి. సోనీ , కంప్యూటర్ విభాగాధిపతి డాll డి. సునీల్ కుమార్, కళాశాల వివిధ విభాగ అధిపతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *