ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి

-ప్రకటనల ప్రదర్శన కోసం మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-పోలింగు కేంద్రానికి 200 మీటర్లు లోపల తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వరాదు
-కలెక్టర్/డి ఈ వో – మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడం లో స్ధానిక సంస్ధల పరిధికి లోబడి, భద్రత పరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల లో ప్రదర్శించే హోర్డింగులు విషయంలో స్థానిక సంస్థలకి చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు మాత్రమే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటి ప్రచారం నిమిత్తం వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాల ను ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంత వరకు ఇంటింటి ప్రచారం కోసం తప్పని సరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలియ చేశారు. ఇంటింటి ప్రచారం సందర్భంలో ఏ రోజూ ఏ మార్గంలో ఏ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొననున్నారో తెలియ చేస్తే, పోలీసు అధికారులు ద్వారా వొచ్చిన దరఖాస్తులను పరిశీలించి సువిధా ద్వారా అనుమతులను జారీ చేయడం జరుగుతుందని అన్నారు.

పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంపై వివరాలు తెలియ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న హోర్డింగ్ల అనుమతి, వాటి పటిష్టత ఆధారంగా కొనసాగించడం పై అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచనలూ తెలియ చెయ్యడం జరుగుతుంది.

పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4 x 8 అడుగుల బ్యానర్, ఒక జెండా మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలియ చేశారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలోపల ఉండకుండా ఆయా తాత్కాలిక కార్యాలయాల కు అనుమతులకు ఇవ్వాలని ఆర్వో లకి సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *