Breaking News

అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల వినియోగం పై ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని, అందుకు తగిన శిక్షణ అందిస్తామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ ల పని తీరుపై సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ఎన్నికల రోజు ఈవిఎంల్లో ఏ సమస్య ఎదురైనా తక్షణం పరిష్కారం చేసేలా శిక్షణ పొందాలని, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు కూడా తగిన శిక్షణ తీసుకోవాలన్నారు. అలాగే ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈవిఎంల పనితీరుతో పాటుగా ఎన్నికల నిర్వహణలో అవసరమయ్యే పిఓ డైరీ, 17సి, వివిధ రకాల ఫారాల గూర్చి సమగ్రంగా తెలుసుకొని ఉండాలని పేర్కొన్నారు. సెక్టోరల్, రూట్ అధికారులకు క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, పోలింగ్ రోజు బ్యారీగేట్లను ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాటు చేస్తారని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓట్ల వివరాలపై బిఎల్ఓలు సహకరిస్తారన్నారు. ఎన్నికల సరళిలో ఏ విధమైన చిన్నపొరపాటుకు తావివ్వడానికి వీలులేదు, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
శిక్షణలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, సెక్టోరల్ అధికారి శ్రీధర్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *