మైలవరంలో టిడిపి, బిజెపి, జనసేన ఆత్మీయ సమావేశం

-రాష్ట్రానికి చంద్రబాబు… దేశానికి మోడీ దిక్సూచి : టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 
-ముఖ్యఅతిథిగా శివనాథ్ గారు హాజరు
-ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ కి బాగా తెలుసు
-సినీ ప్రేక్షకుడిగా పవన్ కళ్యాణ్ అభిమాని..

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన ని పవన్ కళ్యాణ్  రాష్ట్ర ప్రయోజనాల కోసం దూరదృష్టతో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు జూన్ 4వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి అభ్యర్థి కేశినేని శివనాథ్  అన్నారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు మైలవరం నియోజకవర్గ బిజెపి జనసేన టిడిపి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేశినేని శివనాథ్ బిజెపి జనసేన బలపరిచిన మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో బూత్ కమిటీ స్థాయిలో టిడిపి తో పాటు జనసేన చాలా బలంగా ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. బూత్ కమిటీలలో టిడిపి తో పాటు జనసేన బిజెపి కార్యకర్తలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్  సీట్ల విషయంలో తగ్గి జన హృదయాలను గెలుచుకున్నారు. ఆయనకు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు కేసు సమయంలో, తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్  ప్రసంగం మా గుండెల్లో నిలిచిపోతుందని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో ఈ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వారిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్  వస్తానని చెప్పారు.. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం మీదుగానే తిరువూరు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సినీ ప్రేక్షకుడిగా తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని తెలిపారు. సోషల్ మీడియాలో వైసీపీ పేటిఎం బ్యాచ్ మన మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది.. కాబట్టి అందరం అన్నదమ్ముల్లాగా కలిసికట్టుగా వివాహరించాలని కర్తవ్య బోధ చేశారు. రాబోయేది టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలకు ఎంత హక్కు ఉందో… జనసేన కార్యకర్తలకు కూడా అంతే హక్కు ఉంటుందన్నారు.

రాష్ట్రానికి చంద్రబాబు .. ప్రధానమంత్రి మోడీ  దిక్సూచి తెలిపారు. కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.. అమరావతి, పోలవరం నిర్మాణం జరగాలంటే కేంద్ర సహకారం అవసరం. కేంద్రం నుంచి నిధులు ఇప్పించేందుకు బిజెపి నాయకులు కూడా కృషి చేయాలన్నారు. ఎన్డీఏలోకి ఆహ్వానించినందుకు బిజెపి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎటువంటి పదవులు ఆశించకుండా రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి… చంద్రబాబు ని గెలిపించేందుకు వసంత కృష్ణ ప్రసాద్  ధైర్యంగా ముందడుగు వేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి నాయకులు ఎంతోమంది త్యాగం చేశారు .. వారిలో బొమ్మసాని సుబ్బారావు  ఒకరు.. ఆయన పార్టీ గెలుపు కోసం… రాష్ట్ర అభివృద్ధి కోసం వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పనిచేయడం చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి వసంత కృష్ణ ప్రసాద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. అనంతరం వేదిక పైనున్న వసంత కృష్ణ ప్రసాదు, కేశినేని శివనాధ్ (చిన్ని)  బిజెపీ నాయకులు నూతలపాటి బాలకోటేశ్వరరావు, జనసేన నాయకులు అక్కల గాంధీ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఐక్యతను చాటుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి యువ మోర్చా జిల్లా సెక్రెటరీ చిట్టిబాబు, బిజెపి ఇబ్రహీం మండల పార్టీ అధ్యక్షుడు జి అనిల్ కుమార్ , ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ ఎం కృష్ణ మోహన్ , కొండపల్లి మున్సిపల్ ఇంచార్జ్ సిహెచ్ ఆంజనేయులు, లీగల్ సెల్ కన్వీనర్ ఎం రాజేంద్ర, మహిళా మోర్చా జిల్లా సెక్రెటరీ సిహెచ్ లక్ష్మీ, టిడిపి మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ch. శ్రీనివాసరావు, గుర్రాజుపాలెం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మెరుగు నాగేశ్వరరావు, మైలవరం టౌన్ ప్రెసిడెంట్ ఉదయ్ లతోపాటు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *