మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)

-తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
-ఈ విందుకి శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరు
-“కేశినేని కిరణమా” వీడియో సాంగ్ రిలీజ్

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్లాం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే రంజాన్ మాసం ముస్లిమ్స్ సోదరులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలిగించాలి అని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్  ఆకాంక్షించారు. నందిగామ పట్టణంలో బిజెపి జనసేన బలపరిచిన నందిగామ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య  గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివనాథ్ సౌమ్య తో పాటు ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులతో నమాజ్ చేశారు. అనంతరం శివనాథ్ గారు ముస్లిం సోదరులకు ఖర్జూర పళ్ళు అందించి వారి ఉపవాస దీక్ష విరమింప చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లిం సోదరులకు, మహిళలకు, చిన్నారులకు, శివనాథ్  సౌమ్య తో స్వయంగా వడ్డించారు.. ఈ సందర్భంగా జూనియర్  మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందు ప్రజల మధ్య సోదర భావం తో పాటు, మతసామరస్యాన్ని పెంపొందిస్తుందన్నారు. నందిగామలో సౌమ్య గెలుపు ఖాయం అయిపోయిందని… అందుకే ప్రత్యర్థులు ఓడిపోతామని భయంతో నందిగామ నియోజకవర్గంలో భయానికి వాతావరణ సృష్టించేందుకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి దాడులకు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీని ఇంటికి పంపించేందుకు ఓట్లతో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
“కేశినేని కిరణమా ” వీడియో సాంగ్ రిలీజ్
తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ డైరెక్టర్ వీసం జగదీష్ కేశినేని కిరణమా అనే పాట రాశారు. ఈ పాట వీడియో సాంగ్ తో పాటు, బిగ్ సి.డి ని కేశినేని చిన్ని విడుదల చేశారు. పాట రచించిన వీసం జగదీష్ ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు కాండ్రకొండ శీను, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏచూరి రాము, టౌన్ పోల్ కోఆర్డినేటర్ చారి, 8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత , నందిగామ టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ ఎంట్రపల్లి శ్రీను, నందిగామ టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ వంగా సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాయర్ కరిముల్లా, 3వ వార్డు కౌన్సిలర్ ఇమామ్ జానీ, పెండ్యాల గ్రామ నాయకులు షేక్ షబ్బీర్, టిడిపి నాయకులు షేక్ ముస్తఫా, షేక్ మస్తాన్ లతోపాటు టిడిపి జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *