ఎన్నికల ప్రక్రియ పరిశీలన…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు-2024 నేపధ్యంలో భాగంగా ది.25.04.2024 న 49-రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా ఉదయం 10 గంటలకు శ్రీ ఆది కవి నన్నయ యూనివర్సిటీ లోని 49- రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నకు సంబంధించిన ఈ వీ ఎమ్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ విభాగములను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఏ చైత్ర వర్షిణి ఎన్నికల ఏర్పాట్లు కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జనరల్ ఆబ్సర్వర్ కె. బాల సుబ్రమణియం వివరించడం జరిగింది. తదుపరి రాజానగరం రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయములో 11 గంటల నుండి నామినేషన్ ప్రక్రియను స్వయముగా పరిశీలించి యున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల దాఖల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగు సూచనలు చేసియున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలు నిర్వహణా ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమములో రిటర్నింగ్ అధికారి, 49-రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం కుమారి ఎ. చైత్ర వర్షిణి, సహాయ రిటర్నింగ్ అధికారి అబ్దుల్ రహమాన్ మస్తానా మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *