అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కు సంబంధించిన ఈ వీ ఎమ్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ విభాగములనునిర్వహణా , నామినేషన్ పత్రాలు స్వీకరణ ప్రక్రియ పై పార్లమెంటు , అనపర్తి , రాజానగరం, రాజమండ్రీ అర్బన్ రూరల్ అసెంబ్లి నియోజక వర్గాల జనరల్ ఆబ్సర్వర్ కె. బాల సుబ్రమణియం సమగ్ర పరిశీలన చేసినట్లు తెలిపారు. గురువారం అనపర్తి ఆర్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సుబ్రహ్మణ్యం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆర్వో మాధురీ ఎన్నికల ఏర్పాట్ల పై పరిశీలకులు కు వివరించడం జరిగింది. తదుపరి అనపర్తి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయములో నామినేషన్ ప్రక్రియను స్వయముగా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ఖచ్చితంగా పాటించాలని, దాఖలైన నామినేషన్లు సమగ్రంగా పరిశీలనా విధానము పై చర్చించడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలు సంబంధించి తగు సూచనలు చేసియున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలు నిర్వహణా ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమములో రిటర్నింగ్ అధికారి, 40- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో ఎమ్ మాధురీ, సహాయ రిటర్నింగ్ అధికారి, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News