Breaking News

నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా పకడ్బందీగా నిర్వహించాలి…

-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నామినేషన్ల స్కృటిని ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు, రిటర్నింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ మేరకు సజావుగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత ఈఆర్ఓ లను, అధికారులను ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారులు / అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల పరిశీలనపై సందేహ నివృత్తి సెషన్ ను ఎమ్మెస్ టీమ్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ను ఎన్నికల కమీషన్ నిర్వహించగా విసి అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ లతో జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన రేపు శుక్రవారం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన నామినేషన్ల స్కృటిని ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు, రిటర్నింగ్ హ్యాండ్ బుక్ మేరకు పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని నియోజక వర్గాల ఈఆర్ఓ లు, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *