అధికారం లోకి రాగానే ఇసుక ఉచితం… : వసంత కృష్ణ ప్రసాదు

-ప్రజా రాజధాని గా అమరావతి కోనసాగుతుంది
-నాసిరకం మధ్యం అమ్మకాలు బ్యాన్
-రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
-అన్నా క్యాంటిన్ పునః ప్రారంభం

జి కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జి కొండూరులో టౌన్ లో మంగళవారం రాత్రి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి ఎన్నికల ప్రచారం లో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం. అడుగు అడుగున జన నీరజనాల మధ్య మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా ర్యాలీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీ. మంగళవారం రాత్రి స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రచార రధం పై నుంచి విజ్ణప్తి చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమం లో జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు మహిళా నేతలు తెలుగుదేశం, జనసేన బిజెపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *