-బీజేపీలో చేరిన వైసీపీ శ్రేణులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ భారీ ఎత్తున యువత దుష్ట పార్టీ వైసీపీని వీడి బీజేపీలో చేరడం ముదావహమని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు . విజయవాడ లంబాడీ పేట నుంచి భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్ తాజా నోత్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో బీజేపీలో చేరడం సంతోషం కలిగిస్తోందని సుజనా అన్నారు.మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలన్నది తన అభిమతమని సుజనా అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరీ శ్రీరామ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News