రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ఉదయం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలిసు పరిశీలకులు మే 12 , 13 తేదీలలో పోలింగు ముందు రోజున, పోలింగు రోజున, అనంతరం స్ట్రాంగ్ రూమ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాట్ల పై జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పి పి జగదీష్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సాధారణ ఎన్నికల పరిశీలకులు కే. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోఛ, పోలీసుల పరిశీలకులు బలరాం మీనా లకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1577 పొలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రత ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అక్కడ సిబ్బంది నియామకం కోసం తీసుకున్న చర్యల పై కలెక్టర్ మాధవీలత,ఎస్పి పి జగదీష్ కార్యచరణ ప్రణాళికను వివరించడం జరిగింది.
పొలింగ్ ముగిసిన తదుపరి అన్ని అసెంబ్లి నియోజక వర్గాల కు సంబంధించి బ్యాలెట్ యూనిట్స్ నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయా నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం జరుగుతోందని, అందుకు అనుగుణంగా కౌంటింగ్ కోసం టేబుల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా టేబుల్స్ ప్రత్యేక మార్గాలు ఉన్నాయని తెలిపారు.
ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన 19 మండలాలు, మూడు పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 1513 పొలింగ్ కేంద్రాలలో భధ్రత సిబ్బంది ని, ఇతర అనుబంధ శాఖల ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. పొలింగ్ కేంద్రాల వారీగా భద్రత ఏర్పాట్లు చెయ్యడం పై సమగ్ర కార్యాచరణ వివరించారు.
అనంతరం ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ కేంద్రల వద్ద ఏర్పాట్ల తీరును పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహించి ప్రక్రియ, నియమించిన సిబ్బంది, సి సి కెమెరాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్స్ సేవలు అందించడం జరుగుతుంది అని తెలిపారు.
Prajavartha Online Telugu News