గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ని 2714 మంది వినియోగించుకున్నారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అనువుగా ఏసి కాలేజి ఫెసిలిటేషన్ సెంటర్ లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఇతర నియోజకవర్గాలతో కలిపి 669 మంది పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబందించి పోస్టల్ బ్యాలెట్ ని ఈ నెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు 2714 మంది తమ ఓటుని వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి బుధవారం వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వారికి ఎన్నికల కమిషన్ గురువారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారని తెలిపారు.
Prajavartha Online Telugu News