ఓటు హక్కును వినియోగించుకున్న షేక్ ఆసిఫ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54 వ డివిజన్ ఆర్ సి ఎం స్కూల్ లో. 199 బూత్ లో ఓటు హక్కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా షేక్అసిఫ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు.. ప్రతి ఒక్కరూ తమఓటు హక్కు వినియోగించుకోవాలి మనందరి బాధ్యత. ఎలక్షన్ కమిషనర్.పోలింగ్ బూత్ లో ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారు. కానీ ఒక గంట సేపు ఈవీఎంలు పనిచేయడం ఆగాయి. అధికారులు వచ్చి సరి చేశారు మళ్లీ పోలింగ్ మొదలైంది. ఉదయం గంట లేటుగా మొదలు అయింది కాబట్టి సాయంత్రం గంట సేపు సమయం పెంచాలి అని అధికారులను కోరడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *