విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణ లు తేటతెల్లం చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వెబక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు 500ఓట్లకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో అధికారులుతో మాట్లాడి స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కష్టించి పని చేసిన కార్యకర్తలు ఇళ్ళ కు వెళ్లి కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఎన్నికల సమయంలో కూటమి లో ఉన్న పార్టీలు ఎంత సమన్వయం తో పని చేసామో కౌంటింగ్ ప్రక్రియ లో కూడా అంతే సమన్వయం తో పని చేద్దాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలు, కార్యకర్తలు ఎన్నికలలో కష్టించి పని చేసారన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో విస్తారక్ లు చేసి న కృషిని కూడా ప్రస్తావించారు. బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పార్టీ పని విధానం వివరించారు.
Prajavartha Online Telugu News