ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

-ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదు.
-సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పి పి జగదీష్ సమీక్ష.
-కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎటువంటి ర్యాలీలకు గాని ఊరేగింపులకు గాని జాతరలకు గానీ సభలకు సమావేశాలకు గాని ఎటువంటి అనుమతులు లేవు.
-గొడవలు విద్వేషాలు అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు.
-ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, తయారీ మరియు కాల్చడం వంటివి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నిషేధించడం జరిగింది.
-విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.
-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది. 24.05.2024 తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్ల తో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన ముందస్తు భద్రత ఏర్పాట్ల గురించి మరియు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి జిల్లా ఎస్పీ పి జగదీష్ చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ…ఎన్నికల కౌటింగు కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన భద్రత చర్యల పట్ల అధికారులకు అవగాహన కల్పించి, దిశానిర్ధేశం చేయడం జరిగిందన్నారు. కౌటింగు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కౌంటింగు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలన్నారు. కౌంటింగు కేంద్రాలకు విచ్చేసే వివిధ పార్టీలకు చెందిన కౌంటింగు ఏజంట్లు వాహనాలను కౌటింగు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిర్ధేశించిన పార్కింగు ప్రాంతాలకు తరలించాలన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌటింగు కేంద్రాలలోకి వెళ్ళే కౌటింగు ఏజంట్లును కుణ్ణంగా తనిఖీ చేయాలని, రిటర్నింగు అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే కౌటింగు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. కౌటింగు కేంద్రాల పరిసరాలను బాంబ్ డిస్పోజల్స్ బృందాలతో తనిఖీలు చేయాలని, మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఫలితాలు వెల్లడైన తరువాత ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తుచర్యలు చేపట్టాలని, పెట్రోలింగు నిర్వహించాలని, ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో నిఘా పెట్టాలని అధికారులను జిల్లాఎస్పీ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) పి. అనిల్ కుమార్ , అడిషనల్ ఎస్పీ( ఎడ్మిన్) ఎస్. ఆర్. రాజశేఖర్ రాజు , అడిషనల్ ఎస్పీ( ఏ.ఆర్) ఎల్. చెంచి రెడ్డి , జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *