స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలింపు…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ పరిధిలో నీ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరుచుట జరిగినదని జాయింట్ కలెక్టర్, రూరల్ ఆర్వో ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. శుక్రవారం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలించారు. ఈ సందర్బంగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో 3,033 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను న్యాఖ్ భవనంలోనీ రూరల్ నియోజక వర్గ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణానికి తరలించినట్లు తేజ్ భరత్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో వాటినీ పోలిసు ఎస్కార్ట్ మధ్య తరలించడం జరిగిందనీ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం భాను ప్రకాష్, డీటి సుధీర్, పోలీసులు, రాజకీయ పార్టీల, అభ్యర్ధుల ఏజెంట్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *