గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, సకాలంలో జరిగేందుకు అభ్యర్ధులు సహకరించాలని, కౌంటింగ్ జరిగే జూన్ 4 న ఉదయం 6.30 గంటలకు అభ్యర్ధులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు రావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి కోరారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 4 న జరిగనున్న ఓట్ల లెక్కింపు పై గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్ధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు సజావుగా జరగడానికి అభ్యర్ధులు, ఏజెంట్లు సహకరించాలన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కేంద్రంలోనికి రిటర్నింగ్ అధికారి ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ లను కేంద్రంలోనికి అనుమతించబడదు అని తెలిపారు. పోస్టల్ బ్యాలేట్ లెక్కింపుకు 5, ఈ.వి.యం ల ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ.వి.యం ల స్ట్రాంగ్ రూమ్ ఉదయం 6.30 గంటలకు ఓపెన్ చేయుట జరుగుతుందని, అభ్యర్ధులు నిర్దేశిత సమయానికి స్ట్రాంగ్ రూమ్ వద్దకు రావాలని కోరారు. సమావేశంలో ఏఆర్ఓలు సి.హెచ్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, సూపరిండెంట్లు పద్మ, సాంబశివరావు, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్ధులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News