పెంపుడు జంతువులను ప్రేమించే  వారందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్  తప్పనిసరిగా వేయించాలి.

-పశు వైద్యశాలలో  పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి.
-ఏరియా పశు వైద్యశాలలో నిర్వహించు అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమాన్ని
ప్రారంభించిన..
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు.

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో స్థానిక పశు వైద్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి (వాసు) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్( వాసు) మాట్లాడుతూ పెంపుడు జంతువులను ప్రేమించే అందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. జంతువుల నుండి మనుష్యులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా పిలుస్తారని,  ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాజమండ్రి నగరంలో గల పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది ర్యాబిస్ వ్యాధి అని అన్నారు. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మెదడు వాపు, క్షయ,బ్రూసెల్లోసిస్, లెఫ్టు స్పైరోసిస్, నిఫా వైరస్ లాంటి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మనుష్యులకు సంక్రమించే వ్యాధులలో 60 శాతం వ్యాధులు అనగా సుమారు 200 రకాల వ్యాధులు జంతువులే మూల కారణమని,  వాటి నుండి మానవాళి అందరినీ రక్షించు కోవడం మనందరి కర్తవ్యమన్నారు. జంతువులని పెంచే వారందరూ భవిష్యత్తులో వాటికి ఏ ఒక్క వ్యాధి సంక్రమించకుండా వాటి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా వ్యాక్సినేషన్ అందిస్తూ, వాటితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉందామన్నారు.

జిల్లా పశు వైద్య శాఖ అధికారి డా. టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటుచేసిన పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో 50 వేల మంది పెంపుడు జంతువుల యజమానులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నియంత్రణ, వాటి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ ఉచిత వైద్య శిబిరంలో కల్పించడం జరుగుతుందన్నారు. పెంపుడు జంతువులకు మరియు వాటితో దగ్గరగా మెలిగే జంతు యజమాను దారులకు, పశు సంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాలలో పని చేయు సిబ్బందికి మరియు జంతు ప్రేమికులు అందరికీ ఉచితంగా యాంటీరాబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశమును సద్వినియోగ చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి. శ్రీనివాసరావు, ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకు కే.సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది, పెంపుడు జంతువుల సంరక్షణ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *