-45 వ వార్డు ఆర్ అండ్ బి వర్క్ షాప్ స్థలంలో ఉన్న వాంబే కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న..
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా తీసుకోవడం జరుగుతుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు
శనివారం స్థానిక పేపరుమిల్లు సమీపంలో 45 వ వార్డు ఆర్ అండ్ బి వర్క్ షాప్ స్థలంలో ఉన్న వాంబే గృహ సముదాయంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు,ఇతర శాఖల అధికారులతో కలిసి సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు) సందర్శించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు 45 వ వార్డు ఆర్ అండ్ బి వర్క్ షాప్ స్థలంలో ఉన్న వాంబే గృహ సముదాయంలో నివాసముంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య దృష్ట్యా నగరంలోని డ్రైన్స్, అంతర్గత రహదారులు, త్రాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంటి కొరకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చిన లబ్ధిదారులకు పట్టాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వాంబే కాలనీలో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న బ్లాకులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ మీదుగా వెళ్లిన హై టెన్షన్ వైర్ తొలగించినందున ఆ బ్లాకు సిమెంట్ ప్లాస్టింగ్ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల కొరకు ఖాళీ సైట్ మరో బ్లాక్ నిర్మించేందుకు అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్, మున్సిపల్ అధికారులకు సూచించారు.
2014-19 కాలంలో అప్పటి ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వారి కొరకు కమ్యూనిటీ హాల్ ని రు. 1 కోటి రూపాయలతో నిర్మిస్తే తదుపరి గత ప్రభుత్వం ఏమాత్రం కమ్యూనిటీ హాల్ పై శ్రద్ధ చూపకుండా నిర్వీర్యం చేసిందన్నారు. సాధ్యమైనంత త్వరలో కమ్యూనిటీ హాల్ మరమత్తులను చేపట్టి స్థానిక ప్రజలకు అంకితం చేసే విధంగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రజల నుండి సమస్యలపై ఇచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా అధికారులకు అందజేశారు.
శాసనసభ్యుల వెంట మున్సిపల్, హౌసింగ్ అధికారులు, స్థానిక నాయకులు కొయ్యల రమణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News