ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని  క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే భాద్యత అధికారులపై ఉంది

-మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించండి
-ఎర్ర కాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా   ఆధునీకరణ  పనులను చేపట్టాల్సిఉంది.
-నష్టపోయిన రైతాంగానికి  ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలుచేపడుతుంది.
-ఇప్పటికే ఎకరాకు రు. 20 వేలు పెట్టుబడి పెట్టిన రైతాంగం
-మండల స్థాయి తొలి సమీక్ష సమావేశంలో పాల్గొన్న….
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా  అధికారులు  సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన  మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల  దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమ పాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ  ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏరియర్స్ తోపాటు జులై మాసంలో రు. 7 వేల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులను కల్పించేందుకు, పేదవాళ్లు సొంతిల్లు నిర్మించుకునేందుకు ఎంతో ముఖ్యమైన ఇసుకను ప్రభుత్వం ఉచిత ఇసక విధానాన్ని అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు 1600 కోట్లు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రు. 1000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలో మరో 6 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అల్పపీడన ప్రభావం వలన గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా  నిడదవోలు మండలంలోని కొన్ని గ్రామాలోని పంట పొలాలు ముంపుకు గురయ్యాయి అన్నారు. నిడదవోలు మండలంలో  సుమారు 16 వేల ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 12వేల ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే  పరిస్థితి ఉందన్నారు. రైతాంగం  ఇప్పటివరకు ఎకరాకు రు. 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, వాటికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రు. 6 వేల రూపాయలు  అందించే విధంగా  చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే కలెక్టర్ కు  సూచించడం జరిగిందని తెలిపారు. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాలు కారణంగా  ఎర్రకాలువ ముంపు  ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకీకరణ పనులను  చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో గండ్లు పడకుండా  ఎర్ర కాలువ  ఏటిగట్టు పటిష్టతకు దీర్ఘకాలిక  ప్రణాళికతో   చర్యలు  చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో శాసనమండలి సభ్యులు వం కా రవీంద్ర నాధ్, జడ్పిటిసి సభ్యులు కొమ్మిశెట్టి రామాంజని, ప్రత్యేక అధికారి మార్కెటింగ్ శాఖ, ఏడి ఎం, సునీల్ వినయ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ.. బాల శంకరరావు, యంపిడిఓ, కె. హిమమహేశ్వరి, ఎంపీపీ, కార్చెర్ల సీతారామ ప్రసాద్, తాసిల్దార్ డి. సుధ వివి ధ శాఖల మండల స్థాయి అధి కారులు, సర్పంచులు, ఎంపీటీ సీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *