-పాములు పట్టే వాళ్ళు ద్వారా పట్టుకున్న పాములు
-హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
-ఎస్ డి టి కృష్ణా నాయక్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కంసాలి పాలెం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతంలో ని కుటుంబాల వారికి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు భోజన వసతి కల్పించడం జరిగిందని కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.. కృష్ణ నాయక్ తెలిపారు. శనివారము మధ్యాహ్నాం కంసాలి పాలెం ఎంపిపి స్కూలు లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, మెడికల్ క్యాంపు పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా నాయక్ వివరాలు తెలియ చేస్తూ, వరద ముంపు వలన ఈగ్రామంలో ను కుటుంబాల జీవన భృతి కి ఇబ్బందుల నేపధ్యంలో పునరావాస కేంద్రంలో బస, భోజన సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. శుభ్రత తో కూడి, వేడిగా ఆహారాన్ని అందచెస్తూన్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసినా ఆహారాన్ని తినడం జరిగిందన్నారు. వరద ఉదృతి తగ్గే వరకు ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
వరద ప్రవాహానికి పాములు కొట్టుకొని రావడం జరిగిందని, గ్రామస్తులు భయాందోళనకు గురి కావడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళమన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించడం తో రాజమండ్రీ నుంచి స్నాకే స్నచెర్ల్స్ (పాములను పట్టుకునే వారు) కంసాలి పాలెం చేరుకుని పాములను పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ఏ. దుర్గెష్, తహసీల్దార్ వి. నాగభూషణం, గ్రామస్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News