-గురువారం జూలై 30 వ తేదీ ఉదయం 9 గంటలకి జిల్లా కోర్టు ఆవరణ నుంచి కంబాల చెరువు వరకు
-డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ, అమవరాతి హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం పై జిల్లా న్యాయ సేవల అథారిటీ జిల్లా కోర్టు కాంపౌండ్, రాజమహేంద్రవరం నుండి కంబాలచెరువు వరకు జూలై 30 మంగళవారం వాహనముల తో కూడిన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీలో డి ఎల్ ఎస్ ఎ చైర్మన్- కమ్- ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి, సెక్రటరీ-కమ్-సీనియర్ సివిల్ జడ్జి , న్యాయవాదులతో పాటు పారా లీగల్ వాలంటీర్లు, విద్యార్థులు, సిబ్బంది , ఇతర సమన్వయ వాటాదారులు, సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.
Prajavartha Online Telugu News