నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 29 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ ప్రజల నుంచి 29 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలు:
టిడ్కో గ్రహాలు, పారిశుధ్యం, పెన్షన్ లు, డ్రైనేజి, మురుగు నీరు,ఇంటి పన్ను, వీధిలైట్స్ తదితర సమస్యలు పై అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.

ఈ రోజు వచ్చిన అర్జీలు…

వై జంక్షన్, సుబ్బారావు పేటకు రాజమండ్రి కి చెందిన ఏ చిన్నారి అనే మహిళ తనకు మంజూరైన టిట్కో ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదని, ఇంకా ఇల్లు పూర్తిగా తనకు అప్పగించలేదని, సాధ్యమైంది త్వరగా తమకు ఇంటిని అప్పగించవలసిందిగా కోరుట.

పి అండ్ కాలనీ, రాజమహేంద్రవరానికి చెందిన పి. నాగమణి అనే మహిళ ఇంద్ర సత్య నగర్ లోని తమ స్థలానికి దారిప్పించవలసిందిగా కోరుట. దానిలో ఇల్లు నిర్మించుకొనుటకు అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని ఆమె అన్నారు.

రాజమహేంద్రవరానికి చెందిన సయ్యద్ జలాలు హుస్సేన్ అనే ముస్లిం వ్యక్తి తాను ఇటీవల పాన్ షాప్ ను పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని, ప్రస్తుతం ఆ షాపుకు అడ్డుగా డిస్ప్లే బోర్డులు పెట్టి షాపు కనిపించకుండా కొంతమంది వ్యక్తులు తమతో గొడవ పడుతున్నానని సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుట.

కొత్త పట్టిసీమ కు చెందిన కె. విజయలక్ష్మి అనే మహిళ తన కుమారుడు కోరుకొండ నరేష్ చనిపోయినందున తన కుమారుని డెత్ సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరుట.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మునిసిపల్ అదనపు కమీషనర్ పి.యం సత్యవేణి, సూపర్నెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జి.వి.ఎస్. ఎన్. మూర్తి , వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *