రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం .. వర్షా ప్రభావం నేపథ్యంలో శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నేటి అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూరం మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగిందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు , కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని కలెక్టరు ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
Prajavartha Online Telugu News