భోజనం ప్యాకెట్లను ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధనచంద్ర మంగళవారం కండ్రిక జంక్షన్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలకు బోట్ సహాయం అందుతుందా లేదా, భోజనం బోట్ల ద్వారా కానీ, ట్రాక్టర్ ద్వారా కానీ ప్రజలందరికీ అందుతున్నాయా లేదా వార్డ్ సెక్రటరీలు అప్రమత్తంగా ఉన్నారా లేదా, ప్రజలకు ఇంకేమైనా అవసరం ఉందా అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లై ఓవర్ పైన పంపిణీ చేశాక మిగిలి ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తుండాలని, పారిశుద్ధ్య నిర్వహణ కూడా ఖచ్చితంగా జరిగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *