వరద బాధితులకు నైబర్ ఫౌండేషన్ వితరణ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో జరిగిన వరదలలో నిరాశ్రయులకు కాకినాడకు చెందిన నైబర్ ఫౌండేషన్ ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. గాజుల పేట, వై ఎస్ ఆర్ కాలనీ 1, మరియు 2 లలో పేదలకు, మరియు ఫెర్రీ ప్రాంతంలో సర్వం నష్టపోయిన పేదలకు తమ వంతుగా ఆహార పదార్థాలతో పాటు, దుప్పట్లు వితరణ గావించారు. సుమారు 2500 మందికి సహాయం చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.సూర్యారావు తెలిపారు. ఇందుకోసం రూ. 4లక్షల50 వేలు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను అభినందించారు. సహకరించిన నైబర్ ఫౌండేషన్ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రెటరీ కె.అబ్రహం లింకన్, ట్రేజిరెర్ కె.మోజెస్ కుమార్, పి.రాజు, కె.డేవిడ్ రాజు,బి.సి.హెచ్.కోటేశ్వరరావు, రమేష్ మరియు ఇబ్రహీంపట్నం ప్రసాద్రావు నగర్ కు చెందిన యువకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *