ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

-విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా దాతలు ముందుకు రావడం అభినందనీయం
-పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నవినాయక చవితి పండుగ సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాతో గ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు , జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు, జిల్లా వ్యాప్తంగా దాతలు ముందుకు వచ్చి అందచేసిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యము లేకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడీ విగ్రహాలకు మాత్రమే పూజలు నిర్వహించాలని కోరారు. భారతీయులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి పండుగ కి పర్యావరణం తో కూడిన ప్రత్యేకత కలిగి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరినీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *