ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గం

-ఖురాన్‌ జీవన విలువల దిక్సూచి
-పవిత్ర గ్రంథం ఖురాన్ అభ్యసించి ఉత్తీర్ణులైన 9 మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ప్రధానం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-నైతిక విలువలు నేర్పే స్కూల్ గా మదర్సాలను అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్
-చరిత్ర, మనిషి జీవనగమనం, అల్లాహ్ ప్రవచించిన నైతిక విలువలను నేర్చుకొని బయటకి వచ్చిన విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ అభ్యసించి ఉత్తీర్ణులైన 9 మంది విద్యార్థులకి ఆదివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు ప్రధానం చేసి, శుభాశీస్సులు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మంత్రి దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నైతిక విలువలు నేర్పే స్కూల్ గా మదర్సాలను అభివర్ణిస్తూ..అలాంటి మదర్సాలో విద్యను అభ్యసించి చరిత్ర, మనిషి జీవనగమనం, అల్లాహ్ ప్రవచించిన నైతిక విలువలను నేర్చుకొని బయటకి వచ్చిన విద్యార్థులకు మంత్రి దుర్గేష్ శుభాశీస్సులు తెలిపారు. మామూలు చదువులు కాకుండా దైవభీతినీ, జీవన రీతినీ బోధించే ఖురాన్ ను అభ్యసించిన యువకులు సన్మార్గంలో నడిచి మౌలీలుగా రూపాంతరం చెందుతారన్నారు. అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండేందుకు ఈ విద్య ఉపకరిస్తుందని భావిస్తున్నానన్నారు.. అమూల్యమైన ఖురాన్ ను అభ్యసించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ ఆ యువకులపై, ముస్లిం సోదరులపై అల్లా అనుగ్రహం మెండుగా ఉండాలని కోరారు. పవిత్రమైన కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యుడిగా, మంత్రిగా మాట్లాడడం అల్లాహ్ ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *