ప్రశాంతంగా ముగిసిన పదహారవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదహారవ రోజు అనగా 20/10/2024 తేదీన ఉదయం, మధ్యాహ్నం పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 23187 మందికి గాను 19466 మంది అభ్యర్థులు అనగా 83.95 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 73 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12492 మందికి గాను10448 మంది అనగా 83.64 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 64 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 10695 మందికి గాను 9018 మంది అనగా 84.32 శాతం మంది హాజరయ్యారు. పదహారవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *