అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబటూరు, కాంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని కాలక్రమంలో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భవనం నిర్మాణంపై చర్చించాల’ని విజ్ఞప్తి చేశారు. తమ ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు. ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు దేవరకొండ రాజు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఎ.ఎం.మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …