Breaking News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబటూరు, కాంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని కాలక్రమంలో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భవనం నిర్మాణంపై చర్చించాల’ని విజ్ఞప్తి చేశారు. తమ ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు. ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు  దేవరకొండ రాజు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు,  ఎ.ఎం.మనోజ్,  ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *