Breaking News

కాశీ విశ్వేశ్వరుని సేవలో మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసంలో భాగంగా సోమవారం గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున 3 గంటల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముక్కంటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసనాథునికి సుగంధ‌ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కార్తీక సోమవారం పర్వదినాన కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ శివయ్య చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *