Breaking News

Konduri Srinivasa Rao

సెర్ప్ (SERP) తో మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ల‌క్ష్యం

– అర్హులైన ప్రతి స్వయం సహాయక సంఘ మహిళకు జీవనోపాధి – జూలై నెలాఖ‌ర‌కు ప్ర‌తి జిల్లాలో 200 మంది మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లుండాలి – ఉత్త‌రాంధ్ర జిల్లాల జీవ‌నోపాధి కార్య‌క్ర‌మ స‌మీక్ష‌లో మంత్రి కొండ‌ప‌ల్లి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అన్న గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడి గారి విజ‌న్‌కు అనుగుణంగా ప్రతి స్వయం సహాయక సంఘాన్ని (SHG) ఒక పారిశ్రామిక వేత్త కుటుంబంగా మార్చ‌డ‌మే కూటమి ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని రాష్ట్ర …

Read More »

ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు సోమవారం కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. విదర్భ మీదుగా ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం (01-06-2026) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు …

Read More »

హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం

-అక్రమ మైనింగ్, అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి -రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు తగవు -సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలి -దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు -రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు యాదవ్‌పై ఇటీవల జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి …

Read More »

బాబు వస్తే జాబు… జగనొస్తే చావే

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -మెగా డీఎస్సీలో అక్రమాలకు తావే లేదు -వైసీపీ నేతల బిడ్డల సైతం డీఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లగా పనిచేస్తున్నారు -ముఖ్యమంత్రిగా 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుది -5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వని జగన్ -మహానాడులో మహిళ రిజర్వేషన్ల ప్రకటనతో పనిచేయని జగన్ మైండ్ -మెగా డీఎస్సీలో అక్రమాలంటూ డైవర్షన్ పాలిటిక్స్ : మంత్రి సవిత మండిపాటు -అనంతపురంలో మంత్రి సవిత చేతుల మీదుగా …

Read More »

జూన్ 10 నుంచి 15 వరకు సిపిఐ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు

-రైతు సంఘం ధర్నాలకు పార్టీ సంఘీభావం -మోదీ, చంద్రబాబు హయాంలో ధరల బాదుడు -పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపుతో ప్రజలపై పెనుభారం -ఆర్టీసీ ఆస్తులు కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర -కెజి బేసిన్‌లో ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లలో 50% ఎపీకే కేటాయించాలి -జూన్ 1 నుంచి 7 వరకు వామపక్షాల ప్రచారం -జూన్ 9 న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో …

Read More »

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలు

– పేదలకు చీరల పంపిణీ, అన్నసంతర్పణ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సినీ సెంటర్‌లోని పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఈరోజు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజాప్రతినిధులు, కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా …

Read More »

డీఎస్సీపై జగన్ రెడ్డి ఆరోపణలు అర్ధరహితం

-ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అమలు చేయకుండా నిరుద్యోగుల్ని దగా చేశాడు -కూటమి హామీ మేరకు డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేస్తే నీచ రాజకీయాలు చేస్తున్నాడు -యువత, ఉద్యోగులను రోడ్డున పడేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు -మహానాడు విజయవంతం, అభివృద్ధితో జగన్ కడుపు మండిపోతోందన్న మంత్రి కొల్లు రవీంద్ర ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి, మహానాడు విజయవంతం చూసి ఓర్వలేక జగన్ రెడ్డి డీఎస్సీపై దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర …

Read More »

నికోటిన్‌ సేవించడం. ప్రాణాంతకం…

-పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండాలి .. -ఆరోగ్యకర సమాజాన్ని నిర్మాణం లో భాగస్వాములు కండి.. -పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే లా ప్రజలను చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రపంచ …

Read More »

జూన్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, …

Read More »

గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వారు ఆదివారం  అధిక జేష్ఠ మాస పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఉత్సవ మూర్తులుగా భక్తులకు రథంపై ఊరేగింపుగా వెళ్తూ దర్శనం ఇచ్చే విధంగా ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం నిర్వహించింది. ఈరోజున శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని అందుకే …

Read More »