Breaking News

Konduri Srinivasa Rao

భూములు ఇచ్చిన రైతులకు పరిహా పరిహారపు నిధులు విడుదల

-గుంటూరు ఛానల్ విస్తరణకు భూములు ఇచ్చిన ఏడు గ్రామాల రైతుల ఖాతాల్లో జమ -7 గ్రామాల రైతులకు రెండో దఫా చెల్లింపుగా రూ.17.58 కోట్ల విడుదల -తొలి దఫా పరిహారంగా ఇప్పటికే రూ.10.54 కోట్లతో వెరసి రూ. 28.12 కోట్లు చెల్లింపు -సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకి పెమ్మసాని కృతజ్ఞతలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులోని పలు దశలను, సమస్యలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఒక్కోటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ పనులకుగానూ …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

“యాంటీ మలేరియా మాసం – జూన్ 2026”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జూన్ నెలను “యాంటీ మలేరియా మాసం – జూన్ 2026” గా నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన “మలేరియా నిర్మూలన వైపు …

Read More »

జూన్ 1 నుంచి సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు, పట్టా భూముల్లో ఇసుక తీత నిలిపివేత

-మాన్సూన్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా కొనసాగింపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MOEF&CC) మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు వర్షాకాలం (మాన్సూన్ సీజన్)గా పరిగణించబడుతున్నందున, ఈ కాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేయబడతాయని జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని …

Read More »

గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల

-రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు నీటి విడుదల. -సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజీ మరమ్మతులకు రూ.148 కోట్లు – మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, …

Read More »

సమిశ్రగూడెం చెరువు సరికొత్త లుక్..రూ.50 లక్షలతో చెరువు సుందరీకరణ

-రూ.50 లక్షల నిధులతో సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ -సమిశ్రగూడెం చెరువు చెంతన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌తో పర్యాటక శోభ..నిడదవోలులో మారనున్న చెరువుల రూపురేఖలు -పశు సంపద రక్షణకు ఇప్పటికే గోకులం షెడ్డులు ఏర్పాటు..త్వరలోనే నిడదవోలు రూరల్ పరిధిలో ‘కాటిల్ హాస్టల్’ నిర్మాణం చేపడతామని వెల్లడి -కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం..నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత..మంత్రి కందుల దుర్గేష్ హామీ -సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా …

Read More »

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పడమట దర్శిపేట సర్కిల్ నందు అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినీ …

Read More »

గతంలో మోసం… ఇప్పుడు నిర్లక్ష్యం ముస్లింల చిరకాల స్వప్నం ‘షాదీ ఖానా’పై టీడీపీ వైఖరి ఎండగట్టిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

-వైఎస్ జగన్ హయాంలో రూ. 2.5 కోట్లతో నిర్మించిన షాదీ ఖానా తాళాలు వెంటనే తెరవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ సోదర సోదరీమణుల చిరకాల కోరిక అయిన షాదీ ఖానా నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యంగా 2014 నుండి 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (వెన్నుపోటు పార్టీ) మైనారిటీలను ఐదేళ్లపాటు మోసం చేసిందని …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

జూన్ 1, 2 తేదీలలో విజయవాడలో అంతర్జాతీయ స్థాయి సుస్థిర నగరాల సదస్సు

-పట్టణ సుస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావాలపై చర్చలు -దేశవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్న సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (GEF), కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) సంయుక్త ఆధ్వర్యంలో “సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా” ముగింపు సదస్సు జూన్ …

Read More »