-నగర పాలక సంస్థ అధికారులకు కమిషనర్ అదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్‌లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు… మల్లిఖార్జున పేట కొండ ప్రాంతంలో పర్యటిస్తూ, స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. కొండ ప్రాంతములో మూడు లక్షల రూపాయలతో మెట్లు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అదేశించారు. అదే విధంగా రూ.25 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హోలు అభివృద్ది పనులకు అంచనాలు సిద్దం చేయాలన్నారు. 40 లక్షల రూపాలయలతో సిసి రోడ్డు, 20 లక్షల రూపాయలతో …
Read More »Latest News
శ్రీనగరాల సీతారామ స్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనిశెట్టి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఉచితం గా మట్టి వినాయక విగ్రహాలు పంపిణి …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చిట్టినగర్ నందు సాయంత్రం 5 గంటలకు విజయవాడ శ్రీనగరాల సీతారామ స్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనిశెట్టి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఉచితం గా మట్టి వినాయక విగ్రహాలు అలాగే గరికె పరకలు ఉచితంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా సుమారుగా 1000 విగ్రహాలు ప్రజలకు పంపిణి చేసారు. ప్రజలందరూ కరోనా కారణంగా మట్టి విగ్రహాలు పూజించి తదనంతరం వారి ఇంటిలోనే పూల కుండీలలో నిమజ్జనం చెయ్యాలని పర్యావరణాన్ని …
Read More »క్యాన్సర్ చికిత్స లో అత్యాధునిక ఎలక్టా వెర్సా హెటేడి సిస్టమ్ రావడం అభినందనీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ చికిత్సలో అత్యాధునికమైన వెర్స హెటేడి సిస్టమ్ తీసుకోచ్చిన హెచ్ జి సి క్యాన్సర్ హస్పటల్ యాజమాన్యం అభినందనీయులని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం బిఆర్ టియస్ రోడ్ లో హెచ్ జిసి హస్పటల్ లో అత్యాధునికమైన వెర్సాహెటేడి సిస్టమ్ ను ముఖ్య అతిథి శాసన సభ సభ్యులు మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అత్యాధునికమైన వైద్య చికిత్సల కోసం …
Read More »యుద్దం సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -విజయవాడ రాజ్ భవన్ లో ఘనంగా ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ -యుద్ద వీరుల కుటుంబ సభ్యులను సత్కరించిన గవర్నర్ -విజయ జ్యోతిని స్వాగతించిన బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యుద్దాలు సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం వంటివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. యుద్దాల ఫలితంగా సిద్దించే విజయాల వెనుక పలువురు సైనికుల బలిదానం ఉంటుందని, ఇది అయా కుటుంబాలకు అపారమైన కష్ట నష్టాలను అపాదిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. విజయవాడ రాజ్ …
Read More »కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య,ఆరోగ్యశాఖపై సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య,ఆరోగ్యశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 14,452 రికవరీ రేటు 98.60 శాతం 10,494 సచివాలయాల్లో యాక్టివ్ కేసులు నమోదు శాతం జీరో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926 …
Read More »దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది…
-గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం -43వేల బెల్టు షాపులను,4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం -గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆసమయాలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశాం -2018-19లో 661 లక్షల మద్యం బాక్సులు విక్రయిస్తే 2021లో 224 లక్షల బాక్సులు వినియోగం -దశల వారీ మద్య నియంత్రణ చర్యలతో 63శాతం మద్యం వినియోగం తగ్గింది -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్,వాణిజ్యపన్నులు కె.నారాయణ …
Read More »అవనిగడ్డ నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి…
-ఎమ్మెల్యేతో కలసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధవారం అవనిగడ్డ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలసి నియోజకవర్గంలో గృహనిర్మాణం, ఉపాధిహామీ, ఆర్ బీకే, హెల్త్ సెంటర్, సచివాలయ భవన నిర్మాణాలు మండలం, గ్రామాల వారీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద నిరుపేదలకు ప్లాట్లు ఇచ్చి, లెవెలింగ్ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, గృహాలు …
Read More »ప్రముఖ ఆదాయ వనరుగా పర్యాటక రంగం అభివృద్ది…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి …
Read More »అక్టోబర్ మాసాంతానికి పెండింగ్ పింఛన్లు మొత్తం మంజూరు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పింఛన్లు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని, పింఛనర్ల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని, పెండింగ్ లో ఉన్న వివిధ పింఛన్ల సమస్య గురించి తాను ముఖ్యమంత్రితో ప్రస్తావించినట్లు అక్టోబర్ మాసం చివరినాటికి అవన్నీ మంజూరు చేయబడతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను …
Read More »సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన ప్రదర్శన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యములోని కేంద్ర ప్రభుత్వం రైల్వే మార్గాలను, రైళ్లను, రైల్వే స్టేడియం లను, దేశము లో కెల్లా ప్రఖ్యాతి గాంచిన హిల్ స్టేషన్ లను మరియు రైల్వే స్టేషన్ లను మానిటైజేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దేశ వ్యాప్త నిరసన ప్రదర్శనలో భాగముగా బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే …
Read More »