Breaking News

Latest News

గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించడమే జలజీవన్ విషన్ పథకం యొక్క ముఖ్యేద్దేశ్యం..

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలుచేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టి బాధ్యతతో పనిచేసుకుంటూ ముందుకెళ్లిననాడు మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కలిదిండి లోని వెలుగు కార్యాలయంలో మండలంలో జల జీవన్ మిషన్ పనులపై సంబంధిత శాఖల సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని ఉచితంగా అందించేందుకు …

Read More »

సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా యాజమాన్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం దొమ్మేరు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనము నకు మంత్రి తానేటి వనిత శంఖుస్థాపనచేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమ ప్రభుత్వ మన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను …

Read More »

అడుగుకో గుంత… గజానికో గొయ్యి… : పవన్ కల్యాణ్

-వైసీపీ పాలనలో ఏపీ రహదారుల దుస్థితి… -రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు… -పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దాం… -ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దాం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను …

Read More »

నూతక్కి నుండి కుంచనపల్లి వరకు రోడ్డు విస్తరణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్కే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతక్కి నుండి కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును CRIF నిధుల క్రింద 14 కోట్ల రూపాయలతో విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే బుధ‌వారం పాల్గొని నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ చేత శిలాఫలకం ప్రాంభింపచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ నూతక్కి నుండి వయా గుండిమెడ, ప్రాతురు గ్రామాల మీదుగా కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును 14 కోట్ల రూపాయలతో నిర్మించటానికి ఈ రోజు శంకుస్థాపన చేయటం …

Read More »

యాదవ కల్యాణ మండపంన‌కు వెలంప‌ల్లి పౌండేష‌న్ విత‌ర‌ణ‌…

-రెండు లక్షల విలువగల 4 ఏసీలను అంద‌జేసిన వెలంప‌ల్లి సాయిఅశ్విత విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట యాదవ‌ కళ్యాణ మండపం నిర్వాహకుల విన‌తి మేర‌కు వెలంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె సాయి అశ్విత బుధ‌వారం యాదవ‌ కళ్యాణ మండపం నిర్వాహకులకు రెండు లక్షల విలువగల 4 ఏసీలను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్య‌రాలు జ‌మ్ముల పూర్ణ‌మ్మ‌, ప‌ల్లా సూర్యారావు, ప‌ల్లా ముర‌ళీ, పి.ముర‌ళీ కృష్ణ‌, తంగేల రాము, య‌ద‌వ్ క‌ల్యాణ మండ‌పం క‌మిటీ …

Read More »

చట్టాలపై పౌరులు కనీస అవగాహన కలిగి ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పౌర హక్కులపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. 61 డివిజన్ శాంతినగర్ లోని 256 వార్డు సచివాలయంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతి నెలా చివరి రోజున పౌర హక్కుల దినోత్సవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయండం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ …

Read More »

కారుణ్య నియామకం ద్వారా ఐదుగురికి పోస్టింగ్… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

-విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు నగర మేయర్ భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తో కలసి 5 గురికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు అధికారులు మీ యొక్క …

Read More »

యం.కె బేగ్ స్కూల్ లో మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…

-నాడు నేడు పనుల ద్వారా స్కూల్స్‌ అభివృద్ధి -ఎమ్మెల్సీ ఎం.డీ కరీమున్నిస్సా తో కలిసి పర్యటించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో జగనన్న గోరు ముద్ద మధ్యాహ్నం భోజనం ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తుంద‌ని, నాడు నేడు ప‌థ‌కంలో భాగంగా న‌గ‌రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామ‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. బుధ‌వారం ఎమ్మెల్సీ క‌రిమునీస్సా న‌గ‌రపాల‌క సంస్థ …

Read More »

UPSC Test Series పోస్టర్ ను ఆవిష్కరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతూ రానున్న అక్టోబర్ నెల 10వ తారీఖున UPSC-2021 ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన UPSC Test Series కు సంబందించిన పోస్టర్ ను కమీషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ .ఎ.ఎస్ విడుదల చేశారు. ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు U.P.S.C Test Series ఉచితంగా అందిస్తున్నట్లు విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ విజయ కుమార్ తెలిపారు. మాక్ టెస్ట్ సిరీస్ ప్రతి శని, ఆదివారము విద్యాదర్శిని ఐ …

Read More »

రాజ‌కీయ‌ల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు…

-జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం రూ.600కోట్లు రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నులు… -51 ల‌క్ష‌ల సిపి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శుంకుస్థాప‌న… -దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్ర‌భుత్వంలో రాజకీయ‌ల‌కు అతీతంగా అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న ఘ‌న‌త జ‌గ‌న‌న్న‌ది అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు పేర్కొన్నారు. బుధ‌వారం న‌గ‌రంలో 54వ డివిజన్ పరిధిలో రూ.35.00 లక్షల అంచనా వ్యయంతో గాంధీ బొమ్మ సెంటరు నుండి ఖాదర్ సెంటరు వరకు ఏర్పాటు చేయనున్న …

Read More »