విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వేలో నిరంతరం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) వారిచే ‘‘మోస్ట్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రాజెక్టు’’ అవార్డు లభించింది. వ్యాగన్ ఓవర్‌హాలింగ్‌లో చేపట్టిన ఉత్తమమైన వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాయనపాడు వర్క్‌షాపుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించింది. ‘‘ఎన్విరాన్‌మెంట్ బెస్ట్ ప్రాక్టిస్-2021’’ 8వ సీఐఐ జాతీయ అవార్డు కోసం జులై నెలలో …
Read More »Latest News
అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రజలకు ఇక్కట్లు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-23 వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన… -నక్కలరోడ్డులో అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థపై సీరియస్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ నక్కలరోడ్డు ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదులు అందడంతో శాసనసభ్యులు స్థానికంగా పర్యటించారు. వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి చిలుకు దుర్గయ్య వీధిలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. చుట్టుప్రక్కల …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం…
-ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం మారుతీనగర్ అల్లూరి సీతారామరాజు వంతెన సెంటర్ వద్ద 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని శాసనసభ్యులు మల్లాది విష్ణు డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణం పరిష్కరించేదుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలపై డివిజన్ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. వారికి భరోసా …
Read More »కృష్ణాజిల్లాలో మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం… : కలెక్టర్ నివాస్
-లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు -అధికారులు, సిబ్బందిని అభినందించిన కలెక్టర్ నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో మంగళవారం నిర్వహించిన మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసిన ఎఎన్‌యం, ఆశ కార్యకర్తలు, విఏఓలు, వీఆర్వోలు, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. వాక్సినేషన్ మండల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, వైద్యులకు కలెక్టర్ నివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read More »కవులూరు గ్రామంలో నీటిపారుదల సమస్య పరిష్కారం కోసం సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో నీటిపారుదల సమస్య పరిష్కారం కోసం మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కవులూరు గ్రామంలో పంట కాలువలు నీటి పారుదల సమస్యతో రైతులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వినతి మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్లు, మండల సర్వ్ …
Read More »విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో పలు సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో మంగళవారం మర్యాదపూర్వకంగా నేడు ఎమ్మెల్సీ ఎండీ కరి మున్నిసా గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం విజయవాడ నగరంలో పలు సమస్యలపై కమిషనర్ తో ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంభందిత అధికారులను విజయవాడ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రుహుల్లా …
Read More »రేపటి నుంచి ఇంటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కేజీ బరువుకు – 15 రూపాయలు, 1 – 6 కేజీలకు – 25 రూపాయలు, 6 – 10 కేజిలకు – 30 రూపాయలు మరియు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ. సదుపాయాలు కలిపిస్తున్న. R.T. C. …
Read More »“రిలయన్స్ రైజ్” ద్వారా చేనేతలకు చేయూత…
-ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో రిలయన్స్ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్, సీనియర్ టెక్సటైల్ డిజైనర్ కె.కవిత రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిలయన్స్ …
Read More »తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయండి… ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడండి…
-కె.ఆర్.ఎం.బి. కి విజ్ఞప్తి చేసిన సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలమధ్య కృష్ణా నదీజలాల వివాదం, కేంద్రప్రభుత్వం ప్రకటించిన గజెట్ అమలుపై రేపు హైదరాబాద్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి.) సమావేశం జరుగుతున్న నేపథ్యం లో శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏవిధమైన అనుమతులు లేకుండా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేసి ఆంధ్రా రైతుల నీటి హక్కులను …
Read More »రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలని రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం అన్నారు. మంగళవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యవర్గ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు, అనాలోచిత నిర్ణయాలకు మరియు రాజ్యాం, …
Read More »