-ప్రజల సురక్షిత ప్రథమ ప్రాధాన్యత గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. ఫైర్ ఆడిట్ తో పాటు ఆసుపత్రిలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో …
Read More »Daily Archives: May 13, 2026
బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
-ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాణాసంచా తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే అన్నారు. ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని …
Read More »జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల పురోగతిపై ఆయా విభాగాలు, జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశం …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 61 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. బుధవారం నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం …
Read More »నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తైన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని, నిర్మాణానికి ముందే పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్, గాయత్రి నగర్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఇన్నర్ …
Read More »విజయకిలాద్రిపై ఆస్ట్రేలియా బృందం
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాన్ కౌన్సిల్ జనరల్ ఈ సెలై జాకీ, హై కమీషనర్ ఈ ఫిలిప్స్ ఓం వారి బృందం తో సీతానగరంలోని విజయ కిలాద్రికి విచ్చేశారు. విజయకీలాద్రి ఫై ఉన్నట్టు వంటి అన్ని ఆలయాలను, మరియు క్షేత్రపాలుకుడైన 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ను దర్శించుకున్నారు. హనుమాన్ యొక్క మూర్తిని చూసి వారు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు, ఈ విజయ కిలాద్రి దివ్య క్షేత్ర వాతావరణం ఎంతగానో వారికి ఆనందాన్ని కలుగ చేస్తుందని, …
Read More »విద్యా వెలుగులు నింపుతున్న “బడి పిలుస్తుంది” చైతన్య విద్యారథం
-విజయవాడ ఈస్ట్‌లో విద్యా చైతన్య ర్యాలీకి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న “బడి పిలుస్తుంది చైతన్య విద్యారథం” కార్యక్రమం బుధవారం విజయవాడ ఈస్ట్ పరిధిలో ఉత్సాహభరితంగా కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ, ఏపీసీ ఆర్.రమేష్ బాబు పాల్గొని విద్య ప్రాముఖ్యత, ప్రతి చిన్నారి బడికి వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. …
Read More »పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం
-ఎన్టీఆర్ జిల్లాలో 50 సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ -పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని …
Read More »ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిదులు 2025-26సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక, ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఛైర్మన్ గా నలుగురు సభ్యులతో కూడిన …
Read More »సుజనా కార్యాలయంలో బియ్యం అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేజ్లోనిపేట 35 వ డివిజన్ కు చెందిన దువ్వాడ అర్ధ నారీశ్వరరావు అనారోగ్య సమస్య తో ఇటీవల మృతి చెందాడు.. అతని పెద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సాయం కోరారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు 3 బస్తాల బియ్యం అంద చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కి కృతజ్ఞతలు తెలిపారు.
Read More »
Prajavartha Online Telugu News