Breaking News

విద్యా వెలుగులు నింపుతున్న “బడి పిలుస్తుంది” చైతన్య విద్యారథం

-విజయవాడ ఈస్ట్‌లో విద్యా చైతన్య ర్యాలీకి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న “బడి పిలుస్తుంది చైతన్య విద్యారథం” కార్యక్రమం బుధవారం విజయవాడ ఈస్ట్ పరిధిలో ఉత్సాహభరితంగా కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ, ఏపీసీ ఆర్.రమేష్ బాబు పాల్గొని విద్య ప్రాముఖ్యత, ప్రతి చిన్నారి బడికి వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

“ప్రతి చిన్నారి బడిలోకి – ప్రతి కుటుంబంలో విద్యా చైతన్యం” అనే లక్ష్యంతో చేపట్టిన ఈ విద్యారథం ప్రజల్లో విద్యపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *