-సెల్ఫీ/గ్రూప్ రీల్‌లకు ఆహ్వానం – జూలై 29 వరకు ఎంట్రీలు – టాప్-5 విజేతలకు ప్రత్యేక బహుమతులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు 30 సెకన్ల రీల్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో సెల్ఫీ రీల్ లేదా గ్రూప్ రీల్ రూపంలో పాల్గొనే అవకాశం కల్పించారు. పోటీలో పాల్గొనదలిచిన వారు “What ASR International Airport Means to You” …
Read More »Daily Archives: July 26, 2026
ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా సి.యం కు ఆర్టీసి ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రాలు అందిస్తాం…
-జూలై 30 జేఏసి రాష్ట్రకార్యవర్గంలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం -జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టిదామోదరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిపిటిడి (ఆర్టీసి) ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని. జిల్లాలలో ఈనెల 27వ తేదీన వేలాది మంది ఆర్టీసి ఉద్యోగులు చేసిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి సమర్పించనున్నామని ఏపిపిటిడి(ఆర్టీసి)ఉద్యోగసంఘాల కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనద్వారా తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల …
Read More »బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే యార్లగడ్డ
-శ్రీ గాయత్రి అమ్మవారి ఆషాఢ సారే మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే -బ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించాలని ఎంఆర్ఓకు ఆదేశం -త్వరలో కళ్యాణ మండపం నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తానని హామీ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం సొసైటీపేటలో శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానం కమిటీ, గన్నవరం బ్రాహ్మణ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన …
Read More »ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్” ద్వారా రెండో రోజు, ఆదివారం కుమ్మరి పాలెం సెంటర్, లోటస్ అపార్ట్మెంట్స్ దగ్గర నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆశీస్సులతో సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో పైపుల రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం 380 మందికి పెట్టడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం ఎంతో గొప్ప మనసు ఉన్న మహానుభావులందరూ మా ట్రస్టులో మేమున్నాము అంటూ ముందుకు వచ్చి డొక్కా సీతమ్మ ట్రస్టు మీది కాదు మనది …
Read More »‘పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ
-చిత్తడి నేలల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం -పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం -ప్రజా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చిత్తడి నేలల సంరక్షణ చర్యలు -చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం -సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 27వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినియోగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జిఎస్ఆర్ నం.571(ఈ) (తేదీ: 12-08-2021) మరియు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ – 2016 నిబంధనల ప్రకారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆగస్టు 15, 2026 నుండి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, అలాగే నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, విక్రయం, నిల్వ, పంపిణీ, రవాణాపై సంపూర్ణ నిషేధం అమలులోకి రానుందని, పర్యావరణ …
Read More »అమ్మ అక్షరదీపం వేల ఆశయాలకు వెలుగు
-అమ్మ అసోసియేషన్ చేయూతతో ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయండి -అమ్మ స్ఫూర్తితో మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు రండి -పేదల జీవితాల్లో వెలుగులు నింపడంలో భాగస్వాములు కండి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య అనేది ఎవరూ దోచుకోలేని సంపదని.. ఒక విద్యార్థికి అందించే సహాయం ఒక కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపమని… ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందించే చేయూతతో విద్యార్థుల కలలకు రెక్కలు వస్తాయని భవితకు భరోసా ఇస్తుందని జిల్లా కలెక్టర్ …
Read More »పీజీఆర్ఎస్‌పై స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్
– ఈ నెల 27న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని.. అదే విధంగా అర్జీదారులు తమ స్పందన తెలియజేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ డా. …
Read More »
Prajavartha Online Telugu News