Breaking News

Daily Archives: July 26, 2026

ప్ర‌గ‌డ కోట‌య్య సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

– చేనేత రంగ అభివృద్ధిలో ఆయ‌న కృషి వెల‌క‌ట్ట‌లేనిది – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, దేశ చేనేత ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన శ్రీ ప్ర‌గ‌డ కోట‌య్య సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప్రగడ కోటయ్య జయంతి సంద‌ర్భంగా ఆదివారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య సమాజ సేవకు, ప్రజా సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. నిరాడంబర జీవనశైలి, ప్రజల పట్ల …

Read More »

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త దిశ

-భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనవిజయం చేద్దాం -చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి సమావేశంలో పాల్గొన్న కళా వెంకట్రావు, గద్దె బాబురావు, దేవినేని ఉమా విజయనగరం జిల్లా, చీపురుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కళా వెంకటరావు, మాజీ శాసనసభ్యులు గద్దె బాబురావు లతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. …

Read More »

ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా దేశమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా నగరి పట్టణంలోని దేశమ్మ గుడి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు రోజా కి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి …

Read More »

మృదుల, మిధుల పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు గ్రంథాలయ శాశ్వత సభ్యత్వం మరియు తెలుగు కాపీ రైటింగ్ బుక్స్ బహుకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం చదవటం మాకిష్టం కార్యక్రమంలో ఈరోజు మృదుల, మిధుల పుట్టినరోజు శనివారం నాడు జరిగింది. ఈ చిన్నారులు ఈరోజు చదవటం మాకిష్టం కార్యక్రమానికి వచ్చి పుట్టినరోజు వేడుకలు వాళ్ల తల్లిదండ్రులు వోరుగంటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు , పద్మజ మరియు అక్క లాస్య తో ఘనంగా చేసుకున్నారు. ఈ చిన్నారులు వాళ్లకు కానుకగా పెద్దలు ఇచ్చిన నగదును ఈరోజు 10 మంది విద్యార్థులకు 50 రూపాయలు …

Read More »

కార్మిక నాయకులు, వియ్యపు నాగేశ్వరరావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనీ లోటు…

-సంస్మరణ సభలో పలువురి నాయకుల శ్రద్ధాంజలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ నగర సీనియర్ నాయకులు , కార్మిక నేత, ముఠా కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు కామ్రేడ్ వియ్యపు నాగేశ్వరరావు మృతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనీ లోటు అని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో తొలుత పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా …

Read More »

డీఎస్సీ అక్రమాలపై ‘సిబిఐ’ విచారణ జరిపించాలి

-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి -ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల భారీ ర్యాలీలు -వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక …

Read More »

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు సాధించిన విజయం

-కేంద్ర విద్యాశాఖా మంత్రి పదవి బిజెపికి కాకుండా టిడిపి, జెడియులకు ఇవ్వాలి -27న దేశ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా శాఖా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం భారతదేశ వ్యాపితంగా ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థుల ఘన విజయంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అభివర్ణించారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ పరీక్షలలో జరిగిన అవకతవకలకు బాధ్యత …

Read More »