Breaking News

ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య సమాజ సేవకు, ప్రజా సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. నిరాడంబర జీవనశైలి, ప్రజల పట్ల అంకితభావం, సామాజిక న్యాయం కోసం ప్రగడ కోటయ్య చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రగడ కోటయ్య గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని, ప్రజా సేవే పరమావధిగా భావించి విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రగడ కోటయ్య సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *