-పురాతత్వ శాఖ మరియు మ్యూజియం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో మంత్రిని కలిసిన రేవు ముత్యాలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియమ్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి …
Read More »Daily Archives: August 12, 2026
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పట్టన్ శెట్టి రవి సుభాష్ సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. బాధ్యతలు చేపట్టిన నూతన ఎండీకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముందంజలో నిలిపేందుకు …
Read More »పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
-షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు: మంత్రి నిమ్మల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు …
Read More »బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి… : ఏపీ ఎమ్మార్పీఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ఏదో మూల అధికార పార్టీ నేతల చేతుల్లో దళితులు బలైపోతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ఆరోపించారు. బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ధర్మపోరాట దీక్ష జరిగింది. ఇందులో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం …
Read More »బాధిత దళిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి… : మేదర సురేష్‌కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో వైఎసఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేదర సురేష్‌కుమార్ పాల్గొన్నారు. బుధవారం ధర్నాచౌక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హత్యకు గురైన దళితులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 మంది దళితులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని ఈ కేసులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. బాధిత దళిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. న్యాయం కోసం బాధితులకు అండగా నిలుస్తామని కార్యక్రమంలో పాల్గొన్ని సంఘీభావం తెలిపారు.
Read More »ట్రాఫిక్ నిబంధనలపై నే ప్రాణ రక్షణ… : కొల్ల జయశ్రీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని జైహో వాకర్స్ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు న్యాయవాది కొల్ల జయశ్రీ, పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ క్లబ్ అప్పటి నుంచి విజయవాడ నగరంలో వినూత్న సేవా కార్యక్రమాలతో దూసుకుపోతోంది. నిరంతర సేవా పథంలో క్లబ్ సెక్రటరీ రమాదేవి ట్రెజరర్ ఆంజనేయరాజు లైబ్రేరియన్ రమాదేవి సమన్వయంతో క్లబ్ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బందర్ రోడ్డు ఠాగూర్ లైబ్రరీలో జైహో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి …
Read More »APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి మరో ముందడుగు
-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం -ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం తగ్గింపు – APSRTC ఉద్యోగులకు ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి -99%కిపైగా ఖచ్చితత్వంతో పరీక్షలు – గంటలో 100 నమూనాల వరకు ఫలితాలు -ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు మరింత మెరుగైన వైద్య సేవలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్యాధరపురంలోని APSRTC సెంట్రల్ హాస్పిటల్‌లో రూ.22 లక్షల విలువైన …
Read More »అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో గ్రామసభల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ బుధవారం, 2026 ఆగస్టు 12న నార్త్ ఈస్ట్ గ్రిడ్‌లో భాగమైన వెంకటపాలెం, ఈస్ట్ గ్రిడ్‌లో భాగమైన కృష్ణాయపాలెంలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో అమరావతి మాస్టర్ ప్లాన్, …
Read More »ఈ నెల 17, 18, 19 తేదీల్లో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ అత్యవసర సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం ది.19-08-2026 బుధవారం విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. మధుబాబు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం
-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్.. ఇప్పుడు నీతులు చెబుతారా? -అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యం -గొడ్డలి పార్టీ వైఖరి పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ (గొల్లపూడి), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రావడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌రెడ్డికి భయమెందుకని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. మండలి రద్దు చేస్తానని …
Read More »
Prajavartha Online Telugu News