Breaking News

Daily Archives: September 19, 2026

SIR-2026 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రోల్ అబ్జర్వర్ యం. వి.శేషగిరి బాబు IAS

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SIR-2026లో భాగంగా రోల్ అబ్జర్వర్ యం. వి.శేషగిరి బాబు IAS శనివారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు పాఠశాలను, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి జరుగుతున్న SIR-2026 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో SIR-2026లో భాగంగా చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను అధికారులు, బీఎల్వోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఓటర్ల నమోదుకు వచ్చిన …

Read More »

వినాయక పందిళ్ల వద్ద అన్నదాన ప్రదేశాల్లో పరిశుభ్రతపై క్షేత్రస్థాయి పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం నగరంలో వినాయకుని విగ్రహాల వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల ప్రదేశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జోనల్ కమిషనర్ కే. ప్రభుదాస్, ఆర్డీఓ వెన్నెల శ్రీను, నార్త్ ఎంఆర్ఓ లక్ష్మి తదితరులు అజిత్‌సింగ్‌నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం ప్రాంతాల్లో పర్యటించి అన్నదాన కార్యక్రమాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక పందిరి నిర్వాహకులకు అన్నదానం నిర్వహించే సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు …

Read More »

విజయవాడను కాలుష్య రహిత నగరంగా నిర్మిద్దాం

– సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడను కాలుష్య రహిత నగరంగా నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యతని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కే. ప్రభుదాస్ నేతృత్వంలో శనివారం ఉదయం ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు …

Read More »

వినాయక నిమజ్జనం నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం శాఖాధిపతులు, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి జోన్ పరిధిలో ఎన్ని వినాయక విగ్రహాలు, పందిళ్లు ఉన్నాయో, ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో జోనల్ కమిషనర్లు కచ్చితమైన వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వినాయక పందిళ్ల వద్ద …

Read More »

నదులు, కాలువల పరిరక్షణతోనే స్వచ్ఛ విజయవాడ – విద్యార్థులు చైతన్యవంతులై ప్రజల్లో అవగాహన కల్పించాలి

-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలలో “స్వచ్ఛ సాగర్.. సురక్షిత సాగర్” అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి. చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే …

Read More »

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి

-కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి -ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు -ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పును..దేశ వ్యాప్తంగా సుప్రీం అమలు చేయాలి -మోదీ పుట్టినరోజున వారణాసిలో చంద్రబాబు పూజలు ఆక్షేపణీయం -సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ -గ్రామాన్ని యÖనిట్‌గా కరువు ప్రాంతంగా ప్రకటించాలి -ఎకరాకు రూ.50 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి -వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలి -4 వేల విద్యుత్ మీటర్ రీడర్లకు ఉపాధి కల్పించాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక …

Read More »

ధనియాల మిల్లుల్లో తనిఖీలు

-కృత్రిమ రంగుల కల్తీపై అనుమానం.. -అరుదైన రీతిలో రూ.18.20 లక్షల విలువైన 14 వేల కిలోల ధనియాల స్వాధీనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని ధనియాల ప్రాసెసింగ్‌ మిల్లుల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సంచాలకులు అరుణ్‌బాబుతో కలిసి ప్రకాశం జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు బి. వేణుగోపాలరావు, శివతేజ ఈ తనిఖీలు చేపట్టారు. తొలుత శ్రీ గణపతి ఎంటర్‌ప్రైజెస్‌లో తనిఖీలు చేయగా …

Read More »

ప్రతి పాము కాటు ప్రాణాంతకం కాదు

-అప్రమత్తత..సత్వర చికిత్స -తగ్గుతున్న మరణాలు -108 అంబులెన్సుల ద్వారా కూడా చికిత్స -25 వరకు అంతర్జాతీయ పాముకాటు అవగాహన కార్యక్రమాలు -గోడపత్రిక ను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పాము కాటు ప్రాణాంత‌కం కాద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలో 3500 జాతుల పాములున్నాయ‌ని, వీటిలో కొన్ని జాతులు మాత్ర‌మే విష‌పూరిత‌మైన‌వ‌ని తెలిపింది. రాష్ట్రంలో తాచు పాము, ర‌క్త పింజ‌ర‌, క‌ట్ల పాము విష‌పూరిత‌మైన‌వ‌ని తెలిపింది. ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌లో పాములు కూడా ఒక …

Read More »

ఆర్టీసీలో 15 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి

-టీచర్స్, పోలీస్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు హర్షణీయం. -‘స్త్రీ శక్తి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీలో సిబ్బంది కొరతను కూడా ప్రాధాన్యతతో పరిష్కరించాలి. -కండక్టర్, డ్రైవర్, మెకానికల్ సిబ్బందితో పాటు అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలి. -వై. శ్రీనివాసరావు & పలిశెట్టి దామోదరరావు……ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టీచర్స్, పోలీస్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుండటం …

Read More »

ఒక పుస్తకం బహు కరిస్తే ఎంతో మంది జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించినట్లే… : కే రమాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శనివారం జె ఎస్ గుప్తా రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ A A I విజయవాడ ఎయిర్ పోర్టు వారు 5000 రూపాయల విలువగల గ్రూప్ 2 పుస్తకాలను ఠాగూర్ గ్రంథాలయానికి బహుకరించారు. గ్రంథాలయ అధికారి రమాదేవి మాట్లాడతా ఒక పుస్తకం బహుకరిస్తే ఎంతో మంది జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించినట్లు అవుతుందని దాత గుప్తా కి కృతజ్ఞతలు తెలియజేయుట జరిగింది. విద్యార్థులు కూడా నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా …

Read More »