Breaking News

Daily Archives: September 19, 2026

కూటమి పాలనలో “ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు”!

-నిత్యావసరాల ధరలకు అడ్డుకట్టవేయాలి! ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి…జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు” అని సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ రాసి పాడిన ఒక చలనచిత్రంలోని పాట నేటి కూటమి పాలనకు అద్దంపడుతుందని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఎద్దేవా చేసారు.రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపుచేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ స్థానిక డివిజన్ల ఆధ్వర్యంలో వన్ టౌన్, చిట్టినగర్ సెంటర్ లో …

Read More »

ప్రజారాజధాని అమరావతి ప్రాంతవాసులకు మెన్ అడ్వాన్స్డ్ బార్బరింగ్‌లో ఉచిత శిక్షణకు అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA ఆధ్వర్యంలో SRM యూనివర్సిటీ సహకారంతో 2 నెలలపాటు మెన్ అడ్వాన్స్డ్ బార్బరింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమం జరగనుంది. రాజధాని అమరావతి గ్రామాలకు చెందిన 18- 50 సంవత్సరాలలోపు పురుషులకు APCRDA ఆధ్వర్యంలో SRM యూనివర్సిటీ సహకారంతో మెన్ అడ్వాన్స్డ్ బార్బరింగ్‌లో ఉచిత శిక్షణ అందించనున్నాము. ఈ శిక్షణ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో శిక్షణకు సెలవు ఉంటుంది. …

Read More »

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్” ద్వారా శనివారం కొత్తపేట, కే బీ ఎన్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమలో ప్రతి వారం ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి …

Read More »

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,టీడీపీ సీనియర్ నాయకులు, ముసాఫిర్ ఖానా ప్రెసిడెంట్ సయ్యద్ సలీం , కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బ్రాహ్మణ వీధికి చెందిన రంగా భార్గవి (38) గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2.69 లక్షల …

Read More »

మంగినపూడి సాగరతీరంలో వైభవంగా విజయగణపతి మహోత్సవం

-ఆధ్యాత్మికత, సంస్కృతి, పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: బుచ్చి రామ్ ప్రసాద్ -మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయగణపతి మహోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. శనివారం మంగినపూడి సాగరతీరంలోని విజయగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సముద్రతీరంలో ఇంతటి …

Read More »

గురజాడ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి…

-గురజాడ సాహితీ స్ఫూర్తి.. ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం.. చంద్రబాబు అభివృద్ధి–సంక్షేమం -బ్రాహ్మణ సంక్షేమం, అర్చకుల గౌరవానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట : చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహాకవి, ప్రముఖ సాహితీవేత్త గురజాడ అప్పారావు జయంతిని ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నంలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆద్వర్యంలో ఉయ్యూరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు విజిలెన్స్‌పై అవగాహన

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉయ్యూరు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉయ్యూరులోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విజిలెన్స్, నిజాయితీ, సమగ్రత (ఇంటిగ్రిటీ) ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ ఇన్‌చార్జి బి. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విజిలెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నిజాయితీ, నైతిక విలువలను …

Read More »

ఎన్.సి.సి. జాతీయ థల్ సైనిక్ క్యాంపులో పి.బి.సిద్ధార్థ విద్యార్థిని ప్రణీతకు 4వ స్థానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్.సి.సి. (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) విద్యార్థిని ప్రణీత జాతీయస్థాయిలో సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన అఖిల భారత థల్ సైనిక్ క్యాంపులో నాలుగో స్థానం దక్కించుకుంది. ఎన్‌సీసీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయస్థాయి శిబిరాల్లో ఒకటైన థల్ సైనిక్ క్యాంప్ కి విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఫోర్ ఆంధ్ర గాళ్స్ బెటాలియన్ ఎన్.సి.సి. క్యాడెట్ కార్పొరల్  ప్రణీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం …

Read More »

సమస్త కళలకు చేతివృత్తులకు ఆరాధ్య దైవం విశ్వకర్మ భగవాన్… : తోలేటి శ్రీకాంత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిగూడెం పట్టణం జీకే జువెలర్స్ ప్రాంగణమునందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గురజాడ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు మూడో రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేట్ శ్రీకాంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సృష్టికి, సమస్త కళలకు సమస్త చేతివృత్తులకు ఆరాధ్యుడైన దేవ …

Read More »

ఉషా ఇంటర్నేషనల్ కంపెని లిమిటెడ్ సహకారంతో ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉషా ఇంటర్నేషనల్ కంపెని లిమిటెడ్ సహకారంతో వాసవ్య మహిళామండలి నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లోకల్ రీసోర్స్ తరగతులను స్థానిక వాసవ్య మహిళా మండలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్, ఉషాసలై స్కూల్, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, మాట్లాడుతూ ఉషా కంపెణి వారు గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి సహాయకారిగా ఉండాలని కుట్టు శిక్షణా తరగతులు, మిషన్ మరమత్తులను నేర్పించి ఉషా కుట్టు మిషన్లను ఉచితంగా మహిళలకు అందజేసారని, అందులో భాగంగా ఈ రెండు రోజుల …

Read More »