Breaking News

సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా. మానవహక్కుల దినోత్సవం డిసెంబర్ 10న విజయవాడలో నిర్వహించనున్న మహాసభకు సంపూర్ణసహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో పాత పెన్షన్ సాధన కోసం నిర్వహించనున్న మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సి.పి.యస్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.యం.దాస్ మరియు యన్.టి.ఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ల ఆహ్వానం మేరకు,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మహాసభకు ఆహ్వానిస్తూ ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల తరపున విజయవాడలో మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం జానిపాషా మాట్లాడుతూ మానవహక్కుల దినోత్సవం రోజున నిర్వహిస్తున్న మహాసభ విజయవంతం అయ్యేలా కృషి చేస్తామని,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సి.పి.యస్ విధానంలో పని చేస్తున్న దాదాపు మూడు లక్షల యాభై వేల మంది ఉద్యోగుల ఆకాంక్ష అయిన పాత పెన్షన్ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.లక్షా ముప్ఫయివేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు కుటుంబాలకు మేలు చేకూర్చే బృహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగుల తరపున భవిష్యత్తులో పాత పెన్షన్ సాధన కోసం జరిగే ప్రతి అడుగులో భాగస్వాములు అవుతామని ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎం.శశిధర్,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె.సుభాని,రాష్ట్ర సహాయకార్యదర్శి జి.నవీన్ కుమార్,ఫెడరేషన్ విజయవాడ నగర నాయకులు సి.హెచ్.రామకృష్ణ కోటా.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *