Breaking News

గ్రీన్ గుంటూరు గా ఉండేలా పార్క్ అధికారులు, కార్మికులు కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పార్క్ లు, ప్రధాన, అంతర్గత రహదారులు పచ్చదనంతో గ్రీన్ గుంటూరు గా ఉండేలా పార్క్ అధికారులు, కార్మికులు కృషి చేయాలని, హార్టికల్చర్ సిబ్బంది ఇతర విధుల్లో ఉంటే వారిని వెంటనే వెనక్కు పిలిచి విధులు పార్క్ ల విధులు కేటాయించాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఏడిహెచ్ ని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో ఏడిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి నగరంలో పచ్చదనం పెంపు, కార్మికుల పనివిధానం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత హాజరు రిజిస్టర్ మేరకు జిఎంసి ఏడిహెచ్ పరిధిలో ఎంత మంది సిబ్బంది, కార్మికులు ఉన్నారు, వారి ప్రస్తుత పని ప్రదేశాన్ని వివరాలు అడిగి తెలుసుకొని, పార్క్ విధులు కాకుండా ఇతర విధుల్లో ఉన్న వారిని వెనక్కు పిలిచి పార్క్ విధులు కేటాయించాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. గుంటూరు నగరం రానున్న కాలంలో పచ్చదనంతో నిండిన గ్రీన్ గుంటూరుగా ఉండాలని, అందుకు తగిన విధంగా పార్క్ లు, ప్రధాన, అంతర్గత రహదారుల్లో మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని ఆదేశించారు. ప్రతి కార్మికునికి ఐరిష్ ద్వారా తీసుకున్న హాజరు మేరకే జీతాలు ప్రాసెస్ చేయాలని, అలాగే పార్క్ ల వారీగా సంబందిత వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా హాజరు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న సెంట్రల్ మీడియన్స్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని, మీడియన్స్ ల్లో మొక్కలను అందంగా ట్రిమ్మింగ్ చేయాలన్నారు. గుంటూరు నగరాన్ని సుందర పచ్చని నగరంగా మార్చుకోవడంలో ప్రతి కార్మికుడు భాగస్వాములు కావాలని, క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఎదురైనా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *