–కార్యకర్తకు ల్యాప్‌టాప్ అందచేసిన గద్దె క్రాంతికుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వ హాయంలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులు రూ 40 వేలతో కోనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ను గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్‌లోని కనకాల దుర్గాభవానీకి గద్దె క్రాంతికుమార్ అందచేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం లేదా వ్యాపారం నిర్వహించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంటిలో మహిళలు ఉద్యోగం చేయడానికి ఆసక్తీ చూపడం అభినందనీయమని అన్నారు. అందువల్లనే దుర్గాభవాని ఉద్యోగం చేయడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ ల్యాప్‌టాప్‌ను అందచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నేనున్నానంటూ ముందుకు వచ్చి వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారని గద్దె క్రాంతికుమార్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అడుగు జాడల్లోనే నడుస్తు ప్రజలకు అండగా ఉంటానని గద్దె క్రాంతికుమార్ చెప్పారు.
టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ పేద మహిళ, టీడీపీ సీనియర్ కార్యకర్త అయిన దుర్గాభవానీకి ల్యాప్‌టాప్ అందచేయడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు లేని ఒక విద్యార్థికి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ భరిస్తున్నారని చెప్పారు. రాజకీయాలు చూడకుండా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో సహాయం చేస్తున్నారని చెప్పారు. గద్దె క్రాంతికుమార్ తన స్నేహితులు బందువుల కంపెనీల్లో నియోజకవర్గంలోని యువతకు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అడుగు జాడల్లోనే గద్దె క్రాంతికుమార్ కూడా నడుస్తూ మా అందరికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.
ల్యాప్‌టాప్ తీసుకున్న దుర్గాభవానీ మాట్లాడుతూ ల్యాప్‌టాప్ ఉంటే ఇంటి దగ్గర కూడా పని చేసుకుని ఆదాయం సంపాదించుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గారికి చెప్పిన వెంటనే స్పందించి ల్యాప్‌టాప్‌ను ఇంటికి తీసుకువచ్చి అందచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే ఈ విధంగా సహాయం చేసినందుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గారికి ఎంతో రుణపడి ఉంటామని దుర్గాభవానీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో పల్లి దుర్గాప్రసాద్, పిట్టల గోవిందు, పునుగు మాటి మోహన్రావు, కంది వలస అచ్చిత, సప్ప శ్రీనివాస్ , వడ్డేపల్లి కేసవ్, సగరపు అప్పారావు, వడ్డీ సుబ్బారావు, పి నాగు, వనుము దుర్గారావు, పి వాసు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News